Arogyasri Dues: ఏపీలో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం అత్యవసరంగా రూ.203 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ నిధులపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం, ఆస్పత్రుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో పెండింగ్ లో వున్న బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి . ఈ క్రమంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తుంది .
ఆగస్టు నుంచి బిల్లుల పెండింగ్..(Arogyasri Dues)
గత ఆగస్టు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం ప్రకటించింది .అయితే రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఈ నెల 2న సీఈఓ తెలిపారు కానీ ఇప్పటివరకు చెల్లించలేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించా రు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు .ఎన్నికలు కూడా పూర్తవడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపటికీ ఈసీ కూడా అభ్యంతరం తెలపలేదు .