Site icon Prime9

MLA Kapu Ramachandra Reddy: వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై

MLA Kapu Ramachandra Reddy

MLA Kapu Ramachandra Reddy

MLA Kapu Ramachandra Reddy: వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై చెప్పారు. జగన్‌ను నమ్మి పార్టీలోకి వచ్చానని.. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సర్వే పేరుతో టికెట్ ఇవ్వమని అనడం సరికాదని మండిపడ్డారు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాననని.. తాను రాయదుర్గం నుంచి తన భార్య కల్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

మా గొంతు కొస్తాడనుకోలేదు..(MLA Kapu Ramachandra Reddy)

2014, 2019లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని జగన్ పోటీ చేయించారని అన్నారు. తాను గడప గడపకు తిరిగినప్పటికీ సర్వే పేరుతో టికెట్ నిరాకరించడం దారుణమని అన్నారు,మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి.జగన్ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది అని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఇప్పటి వరకు ఎదురు చూశానని, సజ్జల వచ్చి టికెట్ లేదని చెప్పారని అన్నారు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వచ్చానని చెప్పారు. జగన్ కి గుడ్ బై.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి | MLA Kapu Ramachandrareddy Shock To Jagan

Exit mobile version
Skip to toolbar