Site icon Prime9

Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Hyderabad Rain

Hyderabad Rain

 Hyderabad:హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి చినుకులు మొదలయ్యాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ , పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అలాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. జోనల్ కమిషనర్ లు, SE ల తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు, నాలాల దగ్గర నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తా కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ లో ఇప్పుడు వరకు అన్ని జోన్లలో పరిస్తితి నియంత్రణలో ఉందని జోనల్ కమిషనర్లు తెలిపారు.

రాబోయే మూడు రోజులు వర్షాలు..( Hyderabad)

ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం..ఈరోజు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మి ఎత్తులో కొనసాగుతోంది. నిన్న రాయలసీమ, పరిసర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై వున్న చక్రవాతపు ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణశాఖ ప్రకటించింది.

తెలంగాణాలో భారీ వర్షాలు | Heavy Rains In Telangana | Prime9 News

Exit mobile version
Skip to toolbar