Minor girl Rape Case: హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.మీర్ పేట్ మైనర్ బాలిక పై హత్యాచారం చేసిన కేసు లో ఆరుగురిని ఆరెస్ట్ చేసామనిమరొక వ్యక్తి పరార్ లో ఉన్నాడని తెలిపారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందన వనం లో ఈ సంఘటన జరిగింది..
గంజాయి మత్తులో నిందితులు..(Minor girl Rape Case)
ఈ కేసులో మొత్తం ఏడుగురుని గుర్తించామని సీపీ తెలిపారు. ముగ్గురు ప్రత్యేక్షం గా పాల్గొనగా మరో నలుగురు బయట కాపలా ఉన్నారు.మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము.ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు అబేద్ బిన్ కాలేద్ రౌడీ షీటర్. గతంలో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.మైనర్ ను బలవంతంగా బెదిరించి,దాడి చేసి అత్యాచారం చేశారు. నిందితులు గంజాయి తీసుకున్నట్లు తెలుస్తుంది. నిందితులు సెల్ ఫోన్ పడేసి సిగ్నల్ దొరక్కుండా పరారయ్యారు. అమ్రాబాద్ పారిపోతుండగా అరెస్ట్ చేశామని సీపీ చౌహాన్ తెలిపారు.
హైదరాబాద్ మీర్‌పేట్‌లో ఓ మైనర్ బాలికపై సోమవారం ఉదయం దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంట్లోకి దూరి బాలిక తమ్ముడు ఉదయ్ కుమార్ గొంతుకి కత్తి పెట్టి ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులు బాధితురాలిని పైకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.