MP Vijaya Sai Reddy: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్‌పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో తమపైన నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే..(MP Vijaya Sai Reddy)
అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు.పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే. పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే.