Site icon Prime9

Chandrababu Naidu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు పై పీటీ వారెంట్ దాఖలు

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మెడకి మరో కేసు చుట్టుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి పోలీసులు చంద్రబాబుని నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ దాఖలు చేశారు. టెరా సాఫ్ట్ కంపెనీకి నిబంధనలకి విరుద్ధంగా చంద్రబాబు కాంట్రాక్టు ఇచ్చారని సిఐడి అధికారులు చెబుతున్నారు. 2021లో నమోదైన ఈ కేసులో మొత్తం 19మందిపై సిఐడి కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో మొత్తంగా 121 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిఐడికి చెందిన సిట్ చెబుతోంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ 2గా మాజీ ఎండీ సాంబశివరావుని సిఐడి చేర్చింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సిఐడి అధికారులు చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు..(Chandrababu Naidu)

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణపై హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా, అగర్వాల్, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరో బెంచ్‌లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. నేడు  వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 21కి విచారణని వాయిదా వేసింది.

Exit mobile version