Site icon Prime9

Draupadi Murmu: నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu

Draupadi Murmu

Draupadi Murmu: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌‌ రానున్నారు. ఈరోజు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు..(Draupadi Murmu)

ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు. సాయంత్రం ఆరున్నరకు రాష్ట్రపతి రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానంలో చేరుకుని., అక్కడి నుంచి 7 గంటలకు బొల్లారం నిలయానికి చేరుకోనున్నారు. దీనితో ట్రాఫిక్‌కు సంబంధించిన ఏర్పాట్లను సైబరాబాద్‌ సీపీ ఏకే మహంతి పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్‌, ఇంటిలిజెన్స్‌ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది సమయంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం జంక్షన్ మీదుగా లోతుకుంట జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Exit mobile version