Site icon Prime9

Posani Krishnamurali: నారా లోకేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని కృష్ణమురళి

posani

posani

Posani Krishnamurali: ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బుధవారం డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

నన్ను చంపాలనుకుంటున్నారు..(Posani Krishnamurali)

డీజీపీని కలిసి నాకు లోకేష్ బాబు నుంచి ఉన్న ప్రమాదాన్ని వివరించాను. నా భద్రతకు డీజీపీ హామీ ఇచ్చారు.రక్షణ కల్పిస్తామని చెప్పారు. అయితే సెక్యూరిటీ పెంచమని అడుగలేదని తెలిపారు. లోకేష్ టీడీపీలోకి నన్ను చేర్చుకోవాలని ప్రయత్నించారు.పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారు.నేను తెలుగుదేశం పార్టీలో చేరనని చెప్పడంతో నాపై కక్ష పెంచుకున్నాడు.లోకేష్ బాబు గురించి నేను గట్టిగా చెబుతాను కాబట్టే నన్ను లేపేయాలని అనుకున్నాడని ఆరోపించారు. లోకేష్ నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది అని నా శ్రేయోభిలాషులు చెప్పారు.ఎన్టీ రామారావుకు చెప్పే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారా? నేను అగ్రెసివ్ గా మాట్లాడతా కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారు.లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది నేనే. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు.ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడదీస్తావ్ లోకేష్? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు అది చెప్పు అని పోసాని అన్నారు.

నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు ప్రజలు ముఖ్యం అని చంద్రబాబు చెబుతాడా? కాంగ్రెస్ లో ఉన్నపుడు.. మామయ్యా నన్ను పార్టీలో చేర్చుకో.. నాకు ఏమీ వద్దని ఎన్టీఆర్ తో చంద్రబాబు చెప్పారు.కాంగ్రెస్ ఒడిపోగానే టీడీపీ లో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారు.ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచారు.చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయాలని పోసాని డిమాండ్ చేసారు.నేను ఎన్నికల్లో పోటీ చేయను. 13 సంవత్సరాల నుండి జగన్ తో వున్నాను.సినిమావాడిని కాబట్టి ఎఫ్ డి సి ఛైర్మెన్ పదని ఇచ్చారు. జగన్ అంటే నాకు ప్రాణం అని పోసాని చెప్పారు.

నన్ను చంపడానికి చూస్తున్నాడు..లోకేష్ పై పోసాని కేసు | Posani Complaint On Lokesh | Prime9 News

Exit mobile version
Skip to toolbar