Janasena chief Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు నోటీసులు

కృష్ణా జిల్లా పెడన వారాహి యాత్ర సభలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాళ్ళ దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు కదా.? దీనికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అని నోటీసుల్లో ప్రశ్నించారు. ఆధారాలుంటే ఇచ్చి పోలీసులకి సహకరించాలని పోలీసులు కోరారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:37 PM IST

Janasena chief Pawan Kalyan: కృష్ణా జిల్లా పెడన వారాహి యాత్ర సభలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాళ్ళ దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు కదా.? దీనికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అని నోటీసుల్లో ప్రశ్నించారు. ఆధారాలుంటే ఇచ్చి పోలీసులకి సహకరించాలని పోలీసులు కోరారు.

పవన్ కన్నా పటిష్టమైన నిఘా వ్యవస్ద..(Janasena chief Pawan Kalyan)

దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని అన్నారు. పవన్ కంటే పటిష్టమైన నిఘా వ్యవస్ద తమకుందని అన్నారు. అసాంఘిక శక్తులంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పవన్ సభకు బందోబస్తు కల్పిస్తున్నామని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పెడనలో జరిగే వారాహి యాత్రలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. గూండాలు, క్రిమినల్స్ తో రాళ్లదాడులు చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలిసిందన్నారు.

కృష్ణా జిల్లాలో జనసేన వారాహి విజయ యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు జనసేన అధినేత ర్యాలీగా పెడన చేరుకోనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు పెడనలోనే జనసేన భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. నిన్న జరిగిన జనవాణి కార్యక్రమంలో.. వారాహి విజయ యాత్ర పై రాళ్లు విసిరే అవకాశం ఉందని.. జనసేనాని అనుమానం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పెడన మొత్తం బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. జనసేనాని వస్తున్నారన్న సమాచారంతో భారీగా కార్యకర్తలు వచ్చే అవకాశంతో అధికారులు భద్రత పెంచారు.

ఫ్లెక్సీ వివాదం..

పవన్ కళ్యాణ్ నిర్వహించే తోటమూల సభా ప్రాంగణం వద్ద ఫ్లెక్సీ వివాదంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. సభా ప్రాంగణం ముందు వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించమని జనసైనికులు కోరారు. వారు పట్టించుకోకుండా తామెందుకు తమ ఫ్లెక్సీని తీసేయాలని జనసేన కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఫ్లెక్సీ ముందు జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీ వేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. తమ ఫ్లెక్సీ ముందు జనసేన ఫ్లెక్సీ వేయకూడదంటూ వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో ఘర్షణపడ్డారు.