Site icon Prime9

Brother Anil: షర్మిల పార్టీ వెనుక వున్నది పీకేనే- బ్రదర్ అనిల్

Brother Anil

Brother Anil

Brother Anil: షర్మిల‌కు సొంత‌గా పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న లేదు. కానీ, ప్ర‌శాంత్ కిశోర్.. ప‌దేప‌దే వచ్చి సలహాలు ఇవ్వడంతో పార్టీ పెట్టారని ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ సంచలన వ్యాఖ్య చేసారు .తాజాగా బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌నే దూరం చేసుకున్నార‌ు..(Brother Anil)

ష‌ర్మిల‌ను జ‌గ‌నే దూరం చేసుకున్నార‌ని.. రాజ‌కీయంగా ఆమె సేవ‌లు వినియోగించుకుని.. దూరం పెట్టార‌ని చెప్పారు. అయినా.. ష‌ర్మిల ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేద‌న్నారు. కానీ, ప్ర‌శాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్న‌ట్టు అనిల్ తెలిపారు .జ‌గ‌న్ అంటే.. ష‌ర్మిల‌కు అభిమాన‌మేన‌ని , జగన్ ని సీఎంగా చూడాల‌ని త‌పించిందని చెప్పారు . అందుకే జగన్ జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీ ని ముందుండి షర్మిల న‌డిపించిందని తెలిపారు. కానీ, జ‌గ‌న్‌.. ష‌ర్మిల‌ను నిర్ల‌క్ష్యం చేసాడని పేర్కొన్నారు . దింతో షర్మిల బెంగ‌ళూరుకె పరిమితమైందని అన్నారు . ఈ స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిశోర్ వ‌చ్చి పార్టీ పెట్ట‌మ‌న్న‌ప్పుడు కూడా.. జ‌గ‌న్ అభిప్రాయం తీసుకోవాల‌ని చెప్పారన్నారు. పార్టీ పెట్టేందుకు జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని తెలిసి.. మౌనంగా ఉండిపోయార‌ని తెలిపారు.

కేసీఆర్ ఓడిపోవాలనే..

కానీ, ప్ర‌శాంత్ కిశోర్ మాత్రం ష‌ర్మిల‌ను ఒత్తిడి చేసి.. తెలంగాణ ప్ర‌జ‌లు ఆమెను కోరుకుంటున్న‌ట్టు చెప్పార‌న్నారు. జ‌గ‌న్ కూడా.. తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయాలు చేస్తే బాగుంటుంద‌ని గ‌తంలో చెప్పిన నేప‌థ్యంలో ఏపీకి కాకుండా.. తెలంగాణ‌కు షిఫ్ట్ అయ్యా రని బ్ర‌డ‌ర్‌ తెలిపారు. కేసీఆర్ ఓట‌మిని కాంక్షించే తెలంగాణలో పార్టీ పోటీ చేయ‌లేద‌న్నారు. తాను ఎప్పుడూ ష‌ర్మిల రాజ‌కీయా ల్లో జోక్యం చేసుకోలేద‌ని అనిల్ కుమార్ వెల్ల‌డించారు. త‌న పోరాటం త‌నే చేసుకుంద‌న్నారు. రాజ‌కీయాల్లో ష‌ర్మిల‌కు స‌క్సెస్ వ‌స్తుంద‌నే ఆశ త‌న‌కు ఉంద‌న్నారు.ఇప్ప‌టికీ పోరాటాల‌తోనే షర్మిల గ‌డుపుతున్నార‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా గుర్తించార‌ని అనిల్ తెలిపారు. భ‌విష్య‌త్తులో ష‌ర్మిల‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ‌లో ఆమె పెట్టిన‌ పార్టీలో చేరిన వారంతా ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేక‌పోయార‌ని బ్ర‌ద‌ర్ అనిల్ వెల్ల‌డించారు. త‌న వెంట న‌డిచిన వారిని వ‌దిలేశార‌న‌డం స‌రికాద‌న్నారు. అంద‌రికీ న్యాయం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె మాట్లాడార‌ని.. కానీ, కొంద‌రు తొందరపడి విమర్శలు చేసారని తెలిపారు .

Exit mobile version