Petitions for Repolling: రీపోలింగ్ కోసం హైకోర్టులో పిటిషన్లు .. ఎక్కడో తెలుసా?

ఏపీలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని వైసీపీ నేతలు హై కోర్ట్ లో పిటిషన్ లు వేశారు . పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు .

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 03:29 PM IST

Petitions for Repolling: ఏపీలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని వైసీపీ నేతలు హై కోర్ట్ లో పిటిషన్ లు వేశారు . పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు . దింతో అయన హై కోర్ట్ ను ఆశ్రయించారు . సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. మంత్రి అంబటి రాంబాబు వేసిన ఈ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

చంద్రగిరి ,గురజాలలో కూడా..(Petitions for Repolling)

అదే విధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈవోతో పాటు మరో ఏడుగురిని చేర్చారు. ఈ పిటిషన్‌పై కూడా గురువారం విచారణ జరపనుంది హైకోర్టు. మరో వైపు పల్నాడు జిల్లా గురజాలలో కూడా రిగ్గింగ్‌ జరిగిన చోట రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. అవసరమైన చోట రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ బూత్ లో ఈ వీఎం ధ్వంసం చేయడంతో అక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది . అయితే ఏపీ సీఈవో ఎంకే మీనా దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీ పోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.