Site icon Prime9

Rahul Gandhi: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలి.. రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

మాట ఇస్తే కచ్చితంగా నిలబడతా..(Rahul Gandhi)

తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయం వచ్చే శాఖలన్నీ కేసీఆర్‌ కుటుంబం వద్దే ఉన్నాయన్నారు. ధరణితో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ లూటీ చేసిన ప్రతీ పైసాను కాంగ్రెస్ కక్కిస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారు.ధరణితో 20 లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నారు.నేను మోదీని కాను. మాట ఇస్తే కచ్చితంగా నిలబడతా.మహిళలకు ప్రతి నెల రూ.2,500 బ్యాంక్ ఖాతాలో వేస్తాం.మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసారు.

బీఆర్ఎస్ నేతలపై కేసులు లేవు..

ప్రతిపక్ష నేతలందరిపైనా సీబీఐ, ఈడీ కేసులుంటాయి.కానీ బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి కేసులు ఎందుకు ఉండవు?బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.ఇది ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య యుద్ధం. ఓవైపు సీఎం కుటుంబం, మరోవైపు పేదలు, యువత ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది. తెలంగాణ ప్రజల లక్ష కోట్లు మింగేశారు.కేసీఆర్ ఓ రాజులా పెత్తనం చేస్తున్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు.రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు వచ్చే బీజేపీ ఓబీసీని సీఎం ఎలా చేస్తుందని ఆ పార్టీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాహుల్ అన్నారు.

Exit mobile version