Site icon Prime9

Pawan Kalyan: రేపు కొండగట్టులో పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్

Kondagattu

Kondagattu

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు. సేనాని పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ఇక తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెడతారని సాగర్ అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాటం చేస్తామన్నారు. ఏపీలో జనసేన విజయం.. తెలంగాణలో ప్రభావం చూపుతోందని సాగర్ తెలిపారు.

భద్రత ఏర్పాట్లు పరిశీలన..(Pawan Kalyan)

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రత సలహాదారు అర్జున్ దర్శించుకున్నారు. రేపు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన భద్రతతోపాటు.. దర్శనం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. ఉప ముఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కొండగట్టుకు వస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి భద్రత చర్యలపై ముందస్తు జాగ్రత్తలు  పకడ్బందీగా ఉండాలని సూచనలు చేశారు.

 

Exit mobile version