Site icon Prime9

Pawan kalyan in kondagattu: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan kalyan in kondagattu

Pawan kalyan in kondagattu

 Pawan kalyan in kondagattu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు. స్వామి వారికి ముక్కులు తీర్చుకున్న అనంతరం ఆయన హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక పవన్ రాకతో కొండగల్లు వద్ద కోలాహలం పెరిగింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సారి కొండగట్టుకు వచ్చారు.

జనసేనాని కీలక వ్యాఖ్యలు..( Pawan kalyan in konadgattu)

ఇలాఉండగా కొండగట్టుకు వెళ్తూ..తుర్కపల్లిలో ఆగిన జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇరు పార్టీలు కలసి పనిచేస్తాయని వివరించారు. దాంతో జనసేన పార్టీ తెలంగాణలోనూ యాక్టివ్ కానున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి జనసేన పార్టీ పోటీ చేసింది. ఇప్పుడు ఏపీలో ఘన విజయం సాధించడంతో.. అదే ఊపుతో తెలంగాణాలో దూసుకుపోవడానికి జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణ కార్యాచరణ సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొండగట్టులో అంజనీ పుత్రుడు | Pawan Kalyan Visits Kondagattu Hanuman Temple | Prime9 News

Exit mobile version
Skip to toolbar