Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న పవన్ అక్కడనుంచి అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు తమ పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకుంటానని పవన్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనకాపల్లి నుంచి పవన్ పిఠాపురం వెడుతున్నారు. అక్కడ పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
Pawan Kalyan: అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

pawan kalyan