పవన్ కళ్యాణ్: నా వారాహిని ఆపండి.. అప్పుడు నేనేంటో చూపిస్తా..?

నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. 

Pawan Kalyan Varahi: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సభావేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. నేను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రచార రథానికి వారాహి అని పేరుపెట్టుకుని దాని ద్వారా యాత్ర చెయ్యాలని తలచి ఓ వాహనాన్ని తీసుకొస్తే దానిపై కొందరు వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేశారని అసలు మీరు చేసే దోపిడీ ఎంత అంటూ ఆయన మండిపడ్డారు. వారాహి వాహన రిజిస్ట్రేషన్ ఆపేందుకు నానా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారంటూ పవన్ అధికార పార్టీ నేతలపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.  నేను ఏ రంగు వేస్తే మీకేంటయ్యా.. నేను ఏ చట్టాలను అతిక్రమించి వాహనాలను కొనలేదు. నేను కేవలం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మాత్రమే రథయాత్ర చేపడుతున్నాను. నా సొంత డబ్బుతో నేను నా వాహనాలను కొనుక్కుంటూ.. నాకు వీలైనంతగా నా డబ్బులోని ప్రతీ రూపాయిని ప్రజలకోసం వినియోగిస్తున్నా.. మీలాగా నాకు తాతలు సంపాధించిపెట్టిన ఆస్తి లేదు అంటూ ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.

వైసీపీ గాడిదలు సంబంధంలేని విషయాలను మాట్లాడుతూ అనేక రాద్దాంతాలు సృష్టిస్తున్నారని ఇలాంటి గాడిదలకు నేను ఏం చేసినా నచ్చదు.. పోనీ మీరే ప్రజల సమస్యలను పట్టించుని వాళ్లకు మంచి చెయ్యండి మేము అభినందిస్తాం అంటూ ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.