Site icon Prime9

Pawankalyan: నవరత్నాల పై నవ సందేహాలు.. పవన్ కళ్యాణ్

Prime9news

Pawankalyan

Andhrapradesh: వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్  చేశారు. మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా, మూడళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా రెండో రత్నం, అమ్మ ఒడి, అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి, 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు. మూడో రత్నం: పెన్షన్లు, పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా. నాలుగో రత్నం: సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు, 2021-22లో రూ.22 వేల కోట్లు, ఇదేనా మధ్య విధం ఈ ఆదాయం చూపించే రూ. 8వేల కోట్ల బండ్లు అమ్మలేదా, అయిదో రత్నం: జల యజ్ఞం, పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా, ఆరో రత్నం: ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి. సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు. ఏదో రత్నం: ఫీజు రీయింబర్స్మెంట్.. రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా, పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు. ఎనిమిదో రత్నం: పేదలందరికీ ఇళ్ళు, చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. తొమ్మిదో రత్నం: ఆసరా పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు. అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar