Site icon Prime9

Pawan Kalyan: ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో పవన్ కళ్యాణ్ సమావేశం

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇంచార్జ్‌ల అభిప్రాయాలని తెలుసుకున్నారు.

గెలుపే లక్ష్యంగా..(Pawan Kalyan)

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్ళాలని సూచించారు. అవసరమైతే త్యాగాలకి సిద్ధపడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పొత్తుల్లో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లపై చర్చించారు. వైసిపి విమర్శలని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక టీడీపీ నేతలని కలుపుకునిపోతూ నిత్యం ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేనలో ఉన్న బలమైన నేతలకి మరిన్ని బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఇన్ చార్జులకి చెప్పారు. గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టింది.

 

కాకినాడలో సేనాని టూర్ | Janasena Pawan Kalyan Tour In Kakinada | Prime9 News

Exit mobile version
Skip to toolbar