Pawan Kalyan warning:వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతల రౌడీయిజం పై మండిపడ్డారు. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. గూండాగాళ్లు, హంతకులు, నేరస్తులతోటి పాలించబడటానికి సిగ్గుండాలి. నేను సినిమా మాటలు మాట్లాడటం లేదు. రియల్ లైఫ్ లో గొడవలు పెట్టుకోవడం నా కిష్టం. మాట్లాడితే సీఎం బటన్ నొక్కాను డబ్బులిచ్చాను అంటాడు. దళిత డాక్టర్ కరోనా సమయంలో మాస్కులు లేవంటే హింసించి పిచ్చివాడిగా చేసి చనిపోయేటట్లు చేసారు. దైర్యం ఉంటే గూండాలను మట్టిలో తొక్కేయవచ్చు. కులపరంగా, మతపరంగా విడిపోతే మనకే నష్టం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
భగవంతుడికే భయపడతాను..(Pawan Kalyan warning)
ఏలేరు కాలువ ఆధునీకరణ లేకపోవడం వల్ల ఒక పంటమాత్రమే వేయవలసి వస్తోందన్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి రోజుకు రెండు కోట్ల రూపాయల మట్టిని తోలుకు వెళ్లిపోతున్నారు. ఎవరైనా అడిగితే కాకినాడ ఎమ్మెల్యే అనుచరుడు పిస్టల్ తీస్తాడట. పవన్ కళ్యాణ్ భగవంతుడికే భయపడతాడు. నన్ను. నా బిడ్డలను తిట్టినా పడుతున్నాను. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని అతను ప్రామిస్ చేసాడు. జనసేన షణ్మఖ వ్యూహంలో యువతకు ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాము. అమాయకమైన పసిబాలుడిలా సీఎం మాట్లాడుతున్నాడు. బాబాయిని చంపేస్తే రక్తం తుడుచుకుని వచ్చి నోట్లో వేలు పెట్టుకుని కూర్చున్నాడు. క్రిమినల్స్ ను మీరు ఎన్నుకుంటే తప్పు మీదే అవుతంది. నేరస్తులను ఎన్నుకుంటే సహజగుణం ప్రకారం వాడు చంపుతాడు. అందువల్ల జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మార్పు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను అన్నవరం గుడికి వెడితే తన రెండు చెప్పులు ఎత్తుకుపోయారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరినీ బ్రతకనివ్వరు..
తాడేపల్లిలో సీఎం ఇంటికి సమీపంలో రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా ఒక అమ్మాయి ఇంటిని కూల్చేసారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పాను. తరువాత జనసేన వద్దకు ఎందుకు వెళ్లావంటూ ఆమెను వైసీపీ నేతలు బెదిరించారు. చేపలు కొనడానికి వెళ్లిన ఆమె అన్న మూడురోజుల తరువాత ఇంటికి శవంగా వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ కు అడ్డాగా మారింది. వైజాగ్ లో ఎంపీ భార్యను, కొడుకును కిడ్నాప్ చేసారు. గంజాయి మత్తులో ప్రజలను ముంచేస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్తులో జోగుతోంది. నేను ఆంధ్రా నేలను విడిచి వెళ్లను. ఏ గూండాగాడు వచ్చినా కాళ్లు విరగ్గొడదాము. మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక రానిస్తే వారు ఎవరినీ బ్రతకనివ్వరు.
219 దేవాలయాలపై దాడులు జరిగితే..
219 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకోలేదు. అంటే సగటు హిందువుకు, సనాతన ధర్మం పాటించే వాళ్లకి మిగతా మతాలమీద కోపం తెప్పించాలి. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం ఒక్కరినీ పట్టుకోలేదు. నేను మత పిచ్చి ఉన్నవాడిని కాను. ఎక్కడో దూరంగా ఉన్న మసీదులోనుంచి ప్రార్దన వినిసిస్తే దానికి గౌరవం ఇవ్వడం నేర్పింది నాకు హిందూ ధర్మం.ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. పోలీసులు ఏం చేయలేరు. బెత్లహామ్ వెళ్లినపుడు జీసస్ పుట్టిన నేలమీద మోకరిల్లాను. తిరుమలను కూడా అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఏడుకొండల వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు.జనసేన ప్రభుత్వం వస్తే మొదటి సారి బిగించేది లా అండ్ ఆర్డర్ నే. కాకినాడ ఎమ్మెల్యే లాగా రోజుకు రెండు కోట్ల మట్టిని తోలుకెళ్లను. ఆయన గురించి కాకినాడ సభలోనే మాట్లాడుతాను అని పవన్ అన్నారు.