Site icon Prime9

గుంటూరు: పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసులకు మధ్య వివాదం.. మా అధినేతకు పూలదండ కూడా వేయనివ్వరా అంటూ ఫైర్..?

pawan kalyan fans and police fight in guntur

pawan kalyan fans and police fight in guntur

Guntur: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రణరంగం జరుగుతుందనే చెప్పాలి. రాజకీయ పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీనేతలపై దాడులకు పాల్పడుతుండడంతో తీవ్ర ఆందోళనకరం వాతావరణాన్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే మాచర్లలో తెదేపా నేతలు వైసీపీ నేతలపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడి తెదేపా నేతల ఇళ్లకు నిప్పింటిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం అందించేందుకు పవన్ సత్తెనపల్లికి వెళ్లనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.

కాగా పవన్ రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు మంగళగిరిని నుంచి సత్తెనపల్లిలో జరిగే రైతులు భరోసా కార్యక్రమానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు శివారులోని నల్లపాడు ప్రధాన రహదారిపై గజమాలతో జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా పవన్ కాన్వాయ్ ముందుకు కదిలివెళ్లిన వెంటనే జనసేన అభిమానులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల పర్మిషన్లు తీసుకోకుండా ప్రొక్లెయిన్ తో గజమాల ఎందుకు ఏర్పాటు చేశారని పవన్ ఫ్యాన్స్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానితో అసహనం వ్యక్తం చేసిన వారు.. మా పార్టీ అధినేత వస్తే కనీసం పూలదండ కూడా వేయకూడదా అంటూ పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా నల్లపాడు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దానితో పరిస్థితిని అదుపులోకి తెస్తూ పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

గతంలో ఇప్పటం బాధితులను పరామర్శఇంచేందుకు వెళ్తేంటే పవన్ పోలీసులు అడ్డుకుని ఎంత రాద్దాంతం చేశారో అందరికీ తెలిసిందే. ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి రాజకీయ రచ్చగా మారిందో దాని తర్వాత జనసేనాని వేసే ప్రతి అడుగులు ఎంతటి మార్పులు తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పటి నుంచి వైసీపీ కయ్యానికి కాలు దువ్వితే తాము ఏ మాత్రం తగ్గేదేలేదని ప్రజలకు మంచి చెయ్యాలని వెళ్తే తమను అడ్డుకుంటారా అంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ వారాహి రంగుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్స్

Exit mobile version