Pawan Kalyan: జనసేన శాసనసభాపక్షనేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.

  • Written By:
  • Publish Date - June 11, 2024 / 01:22 PM IST

 Pawan Kalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు. దీనిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం జసనేన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశానికి హాజరు అయ్యారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశం అయ్యారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై ఈ సమావేశంలో చర్చించారు. అధిష్టానం ప్రకటనకు అందరు కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించామని ఆమె తెలిపారు. ప్రజలు కూటమి మీద విశ్వాసంతో మంచి విజయం అందించారని.. తమ పని తీరుతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో తమ అభిప్రాయాలు వివరిస్తామన్నారు.