Pawan Kalyan Campaign: తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్‌బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
26న కూకట్ పల్లిలో జరిగే జనసే బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని తెలిసింది. మరోపక్క తెలంగాణ బీజేపీ నాయకత్వం కూడా ఉమ్మడి ప్రచారంపై దృష్టి పెట్టింది. జనసేనతో చర్చలు జరుపుతోంది. మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను కూడా బీజేపీ కేటాయించింది.దీనితో జనసేన తరపున పోటీచేసే అభ్యర్దులకు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న బి ఫాంలు అందజేసారు.
బి ఫాంలని అందుకున్నవారిలో కూకట్‌పల్లినుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కోదాడనుంచి మేకల సతీష్‌రెడ్డి, తాండూరునుంచి నేమూరి శంకర్‌గౌడ్, ఖమ్మంనుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంనుంచి లక్కినేని సురేందర్‌రావు, అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంనుంచి ముయబోయిన ఉమాదేవి, వైరా ఎస్టీ నియోజకవర్గంనుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, నాగర్ కర్నూల్‌నుంచి వంగల లక్ష్మణ్ గౌడ్ జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.