Pavankalyan Comments:కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు..(Pawankalyan Comments)
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మంచి తీర ప్రాంతం ఉంది, అపార మత్స్యసంపద ఉంది… రిలయన్స్, ఓఎన్జీసీ, కాకినాడ ఎస్ఈజెడ్ ఉన్నాయి… ఇలాంటి చోట అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు ఎంతో అవసరం. అదేవిధంగా కాకినాడ సిటీ నుంచి కొండబాబు గెలుపు కూడా కీలకమన్నారు. జగన్ కు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినా ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఒక్కటి నిలబెట్టుకోలేదు. శాంతిభద్రతలు క్షీణించాయి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు. అందుకే, మేం 2014లో ఎలా కలిసి వచ్చామో, ఇప్పుడు కూడా బలమైన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి స్వీప్ చేయబోతోందని పవన్ స్పష్టం చేసారు.