PakageStarJagan: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వాటికి బేరం పెడుతోందని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపించారు. లారస్ ల్యాబ్స్ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులు చనిపోయారని అంతకుముందు పాలిమర్స్, ఇతర రసాయన కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
ప్రాణాంతకమైన రసాయనాలు, పదార్దాలు తయారీ ఉన్న కర్మాగారాలను రెవెన్యూ అధికారులు, పైర్ అండ్ సేఫ్టీ అధికారులు పీరియాడికల్ తనిఖీలు చేయాలని వాటి వివరాలు నమోదు చేయాలని అన్నారు. అయితే వీరికి తాయిలాలు అందడంతోనే ఈ తనిఖీలు జరగడం లేదన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినపుడు మొదట ఎఫ్ఐఆర్, కేసు డైరీ, చార్జిషీటు దాఖలు చేయాలి. తలాపాపం తిలాపిడికెడు అన్నట్లు దీనికి అందరూ బాధ్యులే అన్నారు. స్దానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లనే నిందితులు తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదంపై దర్యాప్తు నివేదిక రాకుండానే నిందితులు సీఎంను కలవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. సీఎం అంత సడెన్ గా అపాయింట్మెంట్ ఇచ్చి నాలుగు కోట్లను తీసుకోవడం ఏమిటి? దీని ప్రభావం దర్యాప్తు అధికారి మీద పడుతుంది. ఎఫ్ అండ్ ఎస్ రిపోర్టు ఎక్కడ ఉంది? అంటూ కళ్యాణ్ ప్రశ్నించారు.
కేసు కోర్టు ముందుకు వచ్చినపుడు కూడా పూర్తి వివరాలు ఉండవని ఆయన అన్నారు. మనకెందుకెలే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండటం వలన ఇటువంటి ప్రమాదాలు పెరుగతూనే ఉన్నాయని అన్నారు. స్దానిక మంత్రి గుడివాడ అమర్ నాథ్ లారస్ ల్యాబ్స్ యాజమాన్యాన్ని సీఎం వద్దకు తీసుకువెళ్లాడని తాను భావించడం లేదన్నారు. అతనికన్నా పెద్ద నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. నాలుగు ప్రాణాలే కదా.. ఎక్స్ గ్రేషియా ఇవ్వచ్చులే అని సీఎం అనుకున్నట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/