Site icon Prime9

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన మహిళ..!

jr ntr prime9news

jr ntr prime9news

Jr NTR: గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఈ మరోసారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ను బీభత్సంగా తిట్టిపోసింది.

అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొన్న ఒక వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటావు. నువ్వు నిజంగా ఎన్టీఆర్ మనవడివైతే రా ముందుకు రా. మీ తాతని అవమానిచ్చినప్పుడు.. నువ్వు ఎందుకు బయటకీ రావు, అలా రానప్పుడు ఇక నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? మేమే లాక్కొస్తాం టీడీపీని అధికారంలోకి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నిజంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్టీ పేరు మార్పు విషయంలో ఎన్టీఆర్ చాలా సున్నితంగా స్పందించారు. ఎన్టీఆర్ నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తాయని ఊహించిన తెలుగుతమ్ముళ్లు ఆయన అలా స్పందించడంపై ఆగ్రహించారు.

ఇదీ చదవండి: మీడియాపై చిరంజీవి ఆగ్రహం..!

Exit mobile version