Janasena Party: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎన్నారై బృందాలు కలిశాయి. ఆస్ట్రేలియ కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్‌కు చెందిన ఎన్నారై జనసేన నేతలు పవన్‌ను కలిశారు.
ఎన్నారైల మద్దతు అమోఘం..(Janasena Party)
ఈ సందర్బంగా వారు పవన్ కళ్యాణ్ కు కోటి 30 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీ ఎప్పటికీ మరువదని ఆయన అన్నారు. పార్టీ ముందుకు వెళ్లడంలో ఎన్నారైలు అందిస్తున్న మద్దతు..చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. మీ ప్రేమాభిమానాలు, మద్దతు పార్టీపై ఎప్పటికీ ఇలానే ఉండాలని పవన్ కోరారు.
మరో వైపు జనసేన పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ గా శ్రీ రవి మిరియాలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఆస్ట్రేలియాలోని ఎన్నారైలకు పార్టీని మరింత చేరువ చేయాలని పార్టీ సిద్దాంతాలు ప్రచారం చేయడంతో పాటు పార్టీ ఉన్నతికోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. రవి మిరియాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇలా ఉండగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నేడు యువగళం నవశకం పేరిట భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు. పోలిపల్లి భూమాత టౌన్‌షిప్‌లో నిర్వహించే ఈ సభకి టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకష్ణ హాజరు కానున్నారు.