Site icon Prime9

Swami Swarupanandendra : మైనారిటీలే కాదు హిందువులు కూడా ఓటర్లే.. స్వామి స్వరూపానందేంద్ర

Swami Swarupanandendra

Swami Swarupanandendra

Swami Swarupanandendra : తెలంగాణలో ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే సరస్వతి దేవిపై మరొక వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడినందుకు బాసరలో బంద్ నిర్వహించారు. ఈ నేపధ్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఘాటుగా స్పందించారు.

హిందు జాతిని మేల్కోలిపే గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం చాలా గొప్పది. అటువంటి దేవాలయాన్ని, అయ్యప్ప స్వామిని కించపరిచే విధంగా ఓ దుర్మార్గులు.. ఇతర మతాలకు అమ్ముడుపోయేవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణం. మహనీయుడు, చాలా గొప్పవాడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్‌ని నమ్ముకున్న కొందరు కూడా.. ఇవాళ అయ్యప్ప స్వామిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. దీనిని ఆపాలంటే ప్రభుత్వాలు కళ్లు తెరవాలని అన్నారు.

హిందూ దేవుళ్లపై దూషణలను అంత ఈజీగా తీసుకోవద్దని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని స్వరూపానందేంద్ర సూచించారు. మైనారిటీలే కాదు హిందువులు కూడా ఓటర్లే అని పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. కాబట్టి హిందూ సమాజాన్ని కించపర్చేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై సరైన సెక్షన్లు పెట్టి జైల్లో కుక్కాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రలో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తగిన శాస్తి జరపాలని స్వరూపానందేంద్ర డిమాండ్ చేసారు.

Exit mobile version
Skip to toolbar