Site icon Prime9

CM KCR Nomination: నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్

Cm Kcr fires on oppositions at aswaraopet meeting

Cm Kcr fires on oppositions at aswaraopet meeting

CM KCR Nomination: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బిఆర్ఎస్ ఎన్నికల కసరత్తుని వేగవంతం చేసింది. ఈ నెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయి బి ఫారాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

నియోజకవర్గాల పర్యటన..(CM KCR Nomination)

అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటించనున్నారు. నవంబర్ 9న రెండు చోట్ల  అంటే గజ్వేల్, కామారెడ్డిలో సీఎం  కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అక్టోబర్ 15 న హైద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 18న.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.

అక్టోబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Exit mobile version