Nimmagadda Prasad: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. వాన్‌పిక్ ఛార్జిషీటు నుంచి అతని పేరును తొలగించేందుకు నిరాకరించిన కోర్టు, అభియోగాలను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది.
165 కోట్లకే 13 వేల ఎకరాలు..(Nimmagadda Prasad)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో వాన్ పిక్ ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేర్ రెడ్డి అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం 13 వేల ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం నిమ్మగడ్డ ప్రసాద్ 1426 కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 165 కోట్లకే దక్కించుకున్నారని సీబీఐ ఆరోపించింది.దీనికి బదులుగా 854 కోట్ల రూపాయలు జగన్ కు నిమ్మగడ్డ లంచంగా ఇచ్చారని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. తన పేరు తొలగించాలంటూ నిమ్మగడ్డ వేసిన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువడింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులు విచారణ ప్రారంభించిన నేపధ్యంలో త్వరలోనే పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు కోర్టులకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.