YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందులలో కేసు నమోదయ్యింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో పులివెందులలో ఐపీసీ సెక్షన్ 156 (3) కింద కేసు నమోదుచేశారు.
ఒత్తిడి చేసి.. బెదిరించి..( YS Viveka Murder Case)
వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని., ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరి నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. అయితే సీబీఐ అధికారులు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాంసింగ్ తనను దారుణంగా కొట్టారని అదేవిధంగా సునీత దంపతులు కూడా తనను బెదిరించారని కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో పులివెందుల పోలీసు స్టేషన్లో ముగ్గరిపై కేసు నమోదు చేసారు.