celebrity club shooting case: హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో జరిగిన కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సినీ నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజగా పోలీసులు గుర్తించారు. శంభో శివశంభో, వినాయకుడు తదితర చిత్రాలలో సూర్యతేజ నటించాడు. ఈ కాల్పుల కేసుకి సంబంధించి మనోజ్, స్మితని షామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంనుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించారు.
యువతను ఆకర్షిస్తున్న జంట.. (celebrity club shooting case)
కాల్పుల ఘటన పూర్వాపరాలని ఆరా తీసిన పోలీసులు స్మిత భర్త సిద్దార్థతోపాటు వారి కూతురు, కుమారుడి స్టేట్‌మెంట్లని కూడా రికార్డు చేశారు. సిద్దార్థ తన పిల్లలని కలుసుకోకూడదని కోర్టు ఆదేశాలున్నాయని స్మిత పోలీసులకి తెలిపింది. తమ మధ్య వివాదం కోర్టు పరిధిలో ఉందని స్మిత పోలీసులకి చెప్పింది. ఈ క్రమంలోనే స్మిత, మనోజ్ వ్యవహారాలపై పోలీసులు ఆరా తీశారు. వీరిద్దరూ మెయిల్స్ ప్యాకింగ్ సోషల్ మీడియా ద్వారా యువతని సినిమా అవకాశాల పేరిట ఆకర్షిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని తెలిసింది.విజయవాడకు చెందిన ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని ట్రాప్ చేసి 50 లక్షలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.