Site icon Prime9

YS Sharmila: కాంగ్రెస్ తో చర్చలు తుది దశకు వచ్చాయి.. వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila: తమ పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని‌ అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనపై సోనియాతో చర్చలు..(YS Sharmila)

కాంగ్రెస్ తో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై సోనియాతో చర్చించాన్నారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమొందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కేసీఆర్ పాలనపై సోనియాతో చర్చించానని అన్నారు. కలిసి పని చేయాలని చర్చించామని చర్చలు తుది దశకు వచ్చాయని అన్నారు.నా వాళ్లే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను నిలబడతా.. కార్యకర్తలనూ నిలబెడతానని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో వైఎస్ఆర్ పేరు చేర్చడం రాహుల్, సోనియా తెలియక చేసిన పొరపాటు గా షర్మిల పేర్కొన్నారు. ఈ విషయంలో వారు రియలైజ్ అయ్యారు. ఇలాంటప్పుడు మనం క్షమించాలా.? వద్దా.? అంటూ షర్మిల ప్రశ్నించారు.

 

కేసీఆర్ పాలనపై సోనియా చర్చించా ; షర్మిల | YS Sharmila | Prime9 News

Exit mobile version
Skip to toolbar