Site icon Prime9

Buddha Venkanna Comments: టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాలి.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Buddha Venkanna

Buddha Venkanna Comments: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమిగెలుచుకుని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు . చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజునే టీడీపీ నూతన అధ్యక్షుడిగా లోకేష్ ను నియమించాలని బుద్ధా వెంకన్న కోరారు .

చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ..(Buddha Venkanna Comments)

గత ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే స్థానాలు లభిస్తే ఇక టీడీపీ పని అయిపోయిందని చాల మంది పక్కకు వెళ్లిపోయారని ,కానీ నారా కుటుంబం అంతా కలిసి కట్టుగా నిలబడి టీడీపీని విజయ తీరాలకు తీసుకెళ్లిందని బుద్ధా వెంకన్న అన్నారు . అదే విధంగా అమరావతిలోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని , చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీని భువనేశ్వరి డిసైడ్ చేస్తారు అని చెప్పారు . చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు . పార్టీ ఓటమి చెందాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా నేను నిలబడ్డాను.. పోరాటం చేయని వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారు.. నాకు అన్ని అర్హతలున్నా టిక్కెట్లు రాలేదు అని పేర్కొన్నారు .

అదే విధంగా ఇప్పటి వరుకు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా వున్న అచ్చెన్నాయుడు కు ప్రమోషన్ ఇచ్చి మంచి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు . అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాగా పని చేశారని కొనియాడారు. తాను తన కోసం అడగడం లేదని.. పార్టీ కోసమే లోకేష్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. నారా లోకేష్‌కు రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే మరో 30 యేళ్లు టీడీపీకి తిరుగు ఉండదన్నారు. పసుపు జెండా రెపరెపలాడాలంటే.. లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Exit mobile version