Site icon Prime9

Nara Lokesh: టీడీపీ సమావేశంలో కంటతడిపెట్టిన నారా లోకేష్

Nara Lokesh

 Nara Lokesh:ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించినందుకా? ( Nara Lokesh)

2019లొ ఒక్క చాన్స్ ఇచ్చినందుకు.. రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి.. వైసీపీని మట్టికరిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలిపారు. తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ.. లోకేష్ కంటతడి పెట్టకున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని.. కన్నీటి పర్యంతం అయ్యారు. రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలను తీసుకు వచ్చారు. ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి కల్పించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించినందుకు చంద్రబాబును జైలుకు పంపించారా? అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినందుకు చంద్రబాబును అరెస్ట్ చేసారా? రైతులకు గిట్టు బాటు ధర ఇవ్వాలని కోరడం తప్పా? ఇసుక దోపిడీ, కల్తీ మద్యం పై మాట్లాడటం మాట్టాడటమే తప్పా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు. భోజనంలో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు మా డీఎన్ఏ లో లేవు.. పోరాట స్పూర్తితో ముందుకు సాగాలంటూ టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

Exit mobile version