Site icon Prime9

‘Nandini’ Ghee: శ్రీవారి లడ్డూకు దూరమయిన ’నందిని‘ నెయ్యి..

'Nandini' Ghee

'Nandini' Ghee

‘Nandini’ Ghee: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందిని నెయ్యిని వినియోగించరు. దీనితో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది.

టీటీడీ టెండర్లలో పాల్గొనని ’నందిని‘(‘Nandini’ Ghee)

మార్చిలో జరిగిన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లో నందిని డెయిరీ పాల్గొనలేదు. దీంతో టెండర్లలో ఎల్ 1 గా వచ్చిన మరో కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాలకు నెయ్యి సరఫరా కాకుండా కక్ష కట్టిందని బీజేపీ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా బీజేపీ ట్వీట్ పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడే టిటిడికి నెయ్యి సరఫరా ఆపేశారని సిద్దరామయ్య కౌంటర్ వేశారు. కౌంటర్ అటాక్ లతో కర్ణాటకలో తిరుమల లడ్డూపై ట్వీట్ వార్ కొనసాగుతోంది.

 

తిరుమల లడ్డూ తయారీకి నందిని నెయ్యి దూరం | Tirupati Laddu | Prime9 News

Exit mobile version
Skip to toolbar