Nadendla Manohar: ఏపీలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది సున్నా అని ఆరోపించారు.
కనీస సేవలు అందడం లేదు..( Nadendla Manohar)
10,408 కేంద్రాల నిర్మాణం పేరుతో రూ.2,300 కోట్ల ఉపాధి హామీ నిధులు పొందారని అయితే నిర్మించినవి 3,200 మాత్రమే అని మనోహర్ అన్నారు. 4,300 కేంద్రాల్లో కనీస పనులు కూడా మొదలు పెట్టలేదన్నారు. ఆర్బీకేల్లో కనీస సేవలు అందడం లేదన్నారు. ప్రతీ కేంద్రంలో అయిదుగురు సిబ్బంది నిత్యం రైతుల సేవల్ో ఉంటారని చెప్పన ప్రభుత్వం దానిలో ఒకే ఒక్కరిని ఉంచి రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందన్నారు. గత నాలుగేన్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం వీటికోసం కేవలం రూ.158.46 కోట్లను మాత్రమే విడుదల చేసిందన్నారు. పలు చోట్ల అద్దె కేంద్రాలకు చెల్లింపులు చేయకపోవడంతో యజమానులు తాళాలు వేసారు. చాలా కేంద్రాల్లో కనీసం పరికరాలు, యంత్రాల జాడే లేదు. ఉన్న చోట మార్కెట్ ధర కంటే చాలా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకోవాలనుకున్నా రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం ఆ సేవలు అందడం లేదు. దీనితో రైతులు ఈ కేవలైీస కేంద్రాలకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. కౌలు రైతులకు వీటివల్ల ప్రయోజనం సున్నా. రాష్ట్రంలో 30 లక్షలకు పైబడి కౌలుేరైతులు ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కేవలం 17 లక్షల కౌలు రైతులే అని బుకాయిస్తోంది. రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కోసం ఉపాధి హామీ నుంచి తీసుకున్న రూ.2,300 కోట్లను సాగునీటి కాలువల ఆధునీకరణకు, పూడిక తీతకు ఉపయోగించి ఉంటే ఇటీవల తుఫాను సమయంలో రైతులకు ఇబ్బందులు ఉండేవి కావని మనోహర్ పేర్కొన్నారు.