Munugode : పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారింది.ప్రధాని పార్టీల అభ్యర్థులు ఓట్లను రాబట్టుకునేందుకు ఓటర్లకు కాసుల వర్షం కురిపిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ‘కాస్ట్లీ’ ఎన్నికలు కావటంతో మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు.తమకు ఏ పార్టీ అభ్యర్థి ఐతే ఎక్కువ డబ్బులు ముట్ట జేబుతాడో వారి పార్టీలకే జై కొడతామని తెగేసి చెబుతున్నారు.
ఈ విషయం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సమయంలోని బహిర్గతమైంది కూడా.ఐతే నోటుకు మీ ఓటును అమ్ముకోవద్దని ? వజ్రాయుధమైన ఓటుతో మీ విలువైన భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినట్టు ఓటర్లకు అర్దం అయ్యేలా చెబుతున్నారు.’కష్టాలు ఎవరికి ఊరికే రావు మీ విలువైన ఓటును అమ్ముకుంటనే వస్తాయంటూ ‘ ఓ ఫోటోను పట్టుకొని మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
ప్రజల ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఒక చక్కటి ఆలోచనతో ఇలా చేశానని , మామూలుగా చెబితే ఎవరూ వినరని ఆలోచించి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వేషం వేశానని శ్యామ్ కుమార్ తెలిపాడు.