Site icon Prime9

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

modi

modi

MP Komatireddy Venkat Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని సమస్యలపై ప్రధానితో మాట్లాడినట్టుగా చెప్పారు.

మూసీ ప్రక్షాళన, హైద్రాబాద్ -విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించే విషయమై చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను లేవనెత్తిన సమస్యలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.హైద్రాబాద్ ఎంఎంటీఎస్ ను జనగామ వరకు పొడిగించాలని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని వెంకట్ రెడ్డి తెలిపారు.

రెండు రోజుల క్రితమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీపీసీసీ కమిటీల నియామకం విషయమై చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.

ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ కు గుడ్ బై చెప్పాలి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా

Exit mobile version