MLC Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొడవలూరు జాతీయ రహదారిపై లారీని ఎమ్మెల్సీ కారు ఢీకొట్టింది. ఈప్రమాదలో పిఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్,ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో అటు వెళ్తున్న జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, గునుకుల కిషోర్ ఎమ్మెల్సీకి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని మెడికల్ సూపరిండెంటెంట్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. కారు అద్దాలు గుచ్చుకోవడంతో తల భాగంలో గాయాలయ్యాయని ఆయన అన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి అన్ని పరీక్షలు నిర్వహించామని,మెదడు, ఛాతీ భాగంలో ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఆయనకు రెండు వారాలు విశ్రాంతి అవసరమన్నారు.