Site icon Prime9

తెలంగాణ: ఈడీకి మొహంచాటేసి కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Rohit Reddy

Rohit Reddy

MLA Rohit Reddy: ప్రగతి భవన్‎లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రగతిభవన్ నుండి బయలుదేరారు పైలట్ రోహిత్ రెడ్డి. సీఎం కేసీఆర్, న్యాయ నిపుణులతో చర్చించారు పైలెట్ రోహిత్ రెడ్డి. ఇప్పటికే తమకు గడువు కావాలంటూ ఈడికి లేఖ అందించారు పైలెట్ రోహిత్ రెడ్డి పిఎ శ్రవణ్ కుమార్. ఈడి కార్యాలయం నుండి వెళ్లిపోయారు శ్రవణ్ కుమార్. పైలెట్ రోహిత్ రెడ్డి అడిగిన గడువు ఈడీ ఇచ్చిందా లేదా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి నేడు ఈడీ ఎదుట హాజరు కావాలని హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి విచారణ కోసం హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీ సులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు వచ్చేప్పుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డి తన ఆధార్‌కార్డ్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌లు తీసుకు రావాలని సూచించారు. 2015, ఏప్రిల్‌ నెల నుంచి తనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, స్థిర, చరాస్తులు, కంపెనీల షేర్లు, ఆస్తుల క్రయ విక్రయాలు, ఆదాయ పన్ను చెల్లింపుల వివరాలు కూడా తీసుకు రావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. కంపెనీల పేరిట తీసుకున్న రుణాలు, రుణ ఒప్పందాలు, చెల్లింపుల వివరాల సమాచారం కూడా తీసుకు రావాలని సూచించారు.

బెంగళూరు డ్రగ్స్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కర్ణాటక పోలీసులు నన్ను ఎప్పుడూ పిలవలేదు. ఇది మొట్టమొదటి సమన్లు, వారు నన్ను ఏ కేసు కోసం పిలుస్తున్నారో వారు ప్రస్తావించలేదు అని రోహిత్ రెడ్డి శుక్రవారం తెలిపారు.

Exit mobile version