Amit Shah’s Visit: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు.. 16వ తేదీ రాత్రికే రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 7గంటల 20 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
బీజేపీ ముఖ్యనేతలతో భేటీ..(Amit Shah’s Visit)
రాత్రి 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అమిత్ షా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11గంటల 10 నిమిషాల వరకూ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం పరేడ్‌లో పాల్గొంటారు. 11 గంటల 15 నిమిషాలకు అక్కడినుంచి బయలుదేరి సీఆర్ పీఎఫ్ సెక్టార్ మెస్‌కు వెళ్తారు. 11 గంటల 50 నిమిషాలనుంచి 12 గంటల 40 నిమిషాల వరకూ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం 2 గంటల 25 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయంనుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు
తన పర్యటనలో, షా నిజాం సైన్యం మరియు రజాకార్లకు (నిజాం పాలన యొక్క సాయుధ మద్దతుదారులు) వ్యతిరేకంగా పోరాడిన సైనికులకు నివాళులర్పిస్తారు. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రసంగించే ముందు షా పారామిలటరీ బలగాల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.నిజాం తన భూభాగాన్ని “ఇస్లాం” చేయాలని ప్రయత్నించాడని, నిజాం పాలనలో హిందువులపై ‘రజాకార్లు’ దౌర్జన్యాలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా ‘విమోచన దినోత్సవం’ (సెప్టెంబర్ 17) నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన తప్పు బట్టారు.