Site icon Prime9

Minister KTR: ప్రచార రధం నుంచి కింద పడిన మంత్రి కేటీఆర్ .. స్వల్పగాయాలు.

Minister KTR

Minister KTR

 Minister KTR: మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరు ఎన్నికల ప్రచారంలో ఉండగా కేటీఆర్ ప్రచార రధం నుంచి కింద పడటంతోస్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రధం రెయిలింగ్ ఊడిపోయి కేటీఆర్ కింద పడ్డారు. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడ కింద పడటంతో వారికి కూడా గాయాలయ్యాయి.

సడన్ బ్రేక్ వేయడంతో..( Minister KTR)

పరిమితికి మించి వాహనం ఎక్కడం, డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ ను చూడకపోవడం, సడన్ గా బ్రేక్ వేయడం, రెయిలింగ్ బలహీనంగా ఉండటం ఈ ప్రమాదానికి కారణాలుగా పేర్కొన్నారు. ఇలా ఉండగా కార్యకర్తలెవరూ ఆందోళన చెందనవసరం లేదని ఇది కేవలం స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని ఎంపీ సురేష్ రెడ్డి చెప్పారు. ఇలావుండగా కేటీఆర్ గురువారం సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో పూజలు చేసి తండ్రి సీఎం కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయలుదేరారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో 11.45 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదో సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అంతకుముందు సిద్దిపేటలోని ఆలయం, దర్గా, చర్చిలో పూజలు చేశారు.

 

Exit mobile version
Skip to toolbar