Site icon Prime9

Metro Trains: నేడు అర్ధరాత్రి 2 గంటల వరకు తిరగనున్న మెట్రోరైళ్లు

Metro trains

Metro trains

Metro Trains: నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి.జనవరి 1 తెల్లవారుజాము 2 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. చివరి గమ్యస్థానాలను 2 గంటలకు చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్‭లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ -లింగంపల్లి, ఫలక్ నామా-లింగంపల్లి లోకల్ ట్రెయిన్స్ అర్ధరాత్రి దాటాక కూడా తిరుగనున్నాయి. అటు రైల్వేస్టేషన్లు, ఇటు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన నిఘా ఉంటుంది.

Exit mobile version