Megastar Chiranjeevi Comments:విశాఖలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జస్టిస్ ఎ.వి.శేషసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్, హరివంశరాయ్‌బచ్చన్ వర్థంతి సందర్భంగా పురస్కారాల ప్రదానం చేశారు. ఈ ఏడాది యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ఇచ్చారు. పురస్కారంతో పాటు యండమూరికి 2 లక్షలు నగదు బహుమతి అందించారు. బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాధాకృష్ణరాజుకు లోక్‌నాయక్ పురస్కారం అందించారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి, కవి విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లికి లోక్‌నాయక్ పురస్కారం ప్రదానం చేశారు.
వారిద్దరూ రెండు కళ్లు..(Megastar Chiranjeevi Comments)
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని వారు తనకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని చెప్పారు.నాకు తొలినాళ్లలో ఫ్యాన్సీ కార్లపై మోజు ఉండేది. కానీ ఎన్టీఆర్ గారు వాహనాల్లో పెట్టుబడి పెట్టవద్దని, భూములు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఆయన సలహా పాటించాను. ఈ రోజు నా రెమ్యూనరేషన్ కంటే ఆ స్దలాలే నన్ను ఆదుకున్నాయని చెప్పారు.అదేవిధంగా ఏఎన్నార్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ పతాక స్థాయికి ఎదగడం చూసి ఏఎన్ఆర్‌గారికి కాస్త ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే వార్తలు వచ్చేవి. కానీ ఆయన సవాల్ గా తీసుకుని తనను తాను శక్తివంతమైన నటుడిగా మార్చుకున్నారు. ఏఎన్నార్ ను చూసిబలహీనతను శక్తిగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలని చిరంజీవి అన్నారు.
నా బయోపిక్ రాసేది యండమూరే..
ఇలా ఉండగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో తన సినీ జీవితంపై పుస్తకం రాబోతోందని.. యండమూరికి వీరేద్రనాథ్కు ఆ బాధ్యతలు అప్పగించానని చిరంజీవి అన్నారు. తన సినీ ప్రస్తానంపై ఆసక్తిగా రాయగల శక్తి ఒక్క యండమూరికే ఉందని చెప్పారు.యండమూరి రాసిన ఐదు నవలలు చిరంజీవి హీరోగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.