Janasena Chief Pawan Kalyan: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఎన్.డి.ఎ.లో భాగస్వాములైన జనసేన బిజెపి కలిసి పోటీ చేసే విషయమై చర్చలు జరిపారు. జనసైనికుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ గారు బిజెపి నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బి.జె.పి. అభ్యర్ధుల గెలుపునకు కృషి చేశామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలనుంచి విరమించుకుని బి.జె.పి. అభ్యర్ధుల విజయానికి కృషి చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి , లక్ష్మణ్‌కి జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.