Hidma: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్‌ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిద్మాను కాల్చి చంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
హిద్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని పోలీసుల వాదనలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆజాద్ అన్నారుపోలీసులు ఆపరేషన్ నిర్వహించారు, కానీ వారినుంచి హిడ్మా తప్పించుకున్నాడని ఆజాద్ చెప్పారు.పోలీసుల దాడికి పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (PGA) తగిన సమాధానం ఇచ్చిందని అన్నారు. పోలీసుల వైమానిక ఆపరేషన్‌ను ఆయన ఖండించారు మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు కోడ్‌నేమ్ అయిన గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బుధవారం జరిగిన కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో మావోయిస్టులు దీనిపై లేఖ విడుదల చేసారు. హిడ్మా సురక్షితంగా ఉన్నాడు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లతో దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్ట్ పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రీ పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీనిలో భాగంగానే మాపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/