Site icon Prime9

Manickam Tagore: కేటీఆర్ కు మాణికం ఠాగూర్ పరువు నష్టం నోటీసులు

Manickam Tagore

Manickam Tagore

Manickam Tagore:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణికం ఠాగూర్‌పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు.

కోమటిరెడ్డికి పంపండి..(Manickam Tagore)

మాణికం ఠాగూర్ లీగల్ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మీరేందుకు గందరగోళ స్థితిలో ఉన్నారని.. లీగల్ నోటీసులతో విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ట్వీట్ చేశారు. మీకు రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొన్నారని వెంకట్‌రెడ్డి ఆరోపించారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి ఆరోపణ ఇంకా రికార్డుగా ఉందన్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలను ఉపహరించుకోలేదని తన వ్యాఖ్యలకు ఇంకా వివరణ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మీరు పరువునష్టం నోటీసును సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డికి పంపాలని కేటీఆర్ సూచించారు.

 

కేటీఆర్పై పరువు నష్టం దావా.. మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు | Big Shock To KTR | Prime9 News

Exit mobile version
Skip to toolbar