Posani Krishna Murali: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
హెరిటేజ్ ఆస్తులు లోకేష్ కు చెందవా ?.. (Posani Krishna Murali)
లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు. తనపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోసాని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని.. మరి హెరిటేజ్ ఆస్తులు లోకేష్ కు చెందవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్షకట్టారని.. పుంగనూరులో పోలీసులపై కూడా హత్యాప్రయత్నం చేశారని పోసాని ఆరోపించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబని అన్నారు.
కోర్టుకు హాజరయ్యే సమయంలో నన్ను చంపాలని చూస్తున్నారు.నేను చచ్చిపోతే లోకేష్ బాధ్యత. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్నవాడిని. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నాను.
నేనూ కేసు పెడతాను, నిజం కావాలా? సాక్ష్యం కావాలా? కంతేరులో భూమి కొన్నాడని అనటం పరువు నష్టం అయిందట.హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది నిజం కాదా? లోకేష్ వాళ్ల అమ్మ, భార్య ఆస్తులు లోకేష్ వి కావా? అంటూ పోసాని ప్రశ్నించారు.