Liquor shops: రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడువల చేసారు

  • Written By:
  • Updated On - April 22, 2024 / 03:15 PM IST

Liquor shops: రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడువల చేసారు.  అంతకుముందు  పలు సంస్దల ప్రతినిధులతో  సమావేశం నిర్వహించిన కమీషనర్ శోభాయాత్ర  ప్రశాంతంగా జరిగేలా అందరూ సహ కరించాలని కోరారు. శోభాయాత్రలో డీజే ఏర్పాటు చేయడం, రెచ్చ గొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు ఉండకూడదని అన్నారు. యాత్ర నిర్దేశించిన మార్గాల్లో సాగాలని దీనికోసం పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు.  నిర్వాహకులు తమ ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు  అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్పదని కమీషనర్ హెచ్చరించారు.

హనుమాన్ శోభాయాత్ర..((Liquor shops)

హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్బంగా నిర్వహించే శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించబడుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. యాత్ర ఆయా మార్గాలగుండా సాగుతున్నపుడు వాహనదారులు ప్రత్నుమ్నాయ మార్గాలగుండా వెళ్లాలని వారు సూచించారు. హనుమాన్ శోభాయాత్ర మంగళవారం ఉదయం 11 .30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయి రాత్రి 8 గంటలకు చేరుకుంటుంది.

హనుమాన్ జయంతికి ప్రత్యేక ఏర్పాట్లు..

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పర్వదినాల సమయంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్బంగా వైన్స్ షాపులు బంద్ చేసారు. అదేవిధంగా ఇపుడు మంగళవారం ఉదయం నంచి మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసారు. హనుమాన్ జయంతి సందర్బంగా కొండ గట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలనుంచి వాహనాలలో వచ్చే భక్తులకు 7 వాహన పార్కింగులు ఏర్పాటు చేస్తున్నారు. హనుమాన్ మాల ధారణ తీయడానికి వచ్చే భక్తులకు 3 కేశ ఖండన ప్రాంతాలు, 125 షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీటికి ఇబ్బందిపడకుండా 50 చలివేంద్రాలు, అత్యవసర వైద్యసేవల కోసం 6 మెడికల్ క్యాంపులు, 2 అంబులెన్స్ లు, నిఘా కోసం 100 సీసీ కెమేరాలు, పారిశుధ్యం నిర్వహణకోసం 380 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. అదేవిధంగా అత్యసవర సమయాల్లో వినియోగానికి 2 అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.