Site icon Prime9

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్ట్ లపై నేతల నజర్

Nominated Posts

Nominated Posts

Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది .మంత్రి పదవుల పందారం పూర్తయింది .శాఖలు కేటాయించారు .ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు .24మందికి మంత్రి పదవులు దక్కాయి. ఈ విషయంలో సీనియర్స్ కంటే జూనియర్స్,కొత్తవారికి బాగా అవకాశం ఇచ్చారు . దీనిపై సానుకూలంగా స్పందించారు గోరంట్ల బుచ్చియ్య చౌదరి ,యనమల రామకృష్ణుడు లాంటి పలువురు సీనియర్లు. ఇప్పుడు అసలు చర్చంతా నామినేటెడ్ పోస్ట్ లపై మొదలైం ది . మరోపక్క ఇప్పట్లో రెండు మూడు ఎమ్మెల్సీ పదవులు తప్ప ఎక్కువగా దక్కే అవకాశం లేకపోవడంతో నేతలంతా నామినేటెడ్ పదవులపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. మండలిలో ఇంకా వైసీపీ కే ఆధిక్యత వుంది .2025 లో కొన్ని స్థానాలు మాత్రమే భర్తీ కానున్నాయి . 2027 నుంచి ఖాళీలు ఎక్కువగా ఉంటాయి .అప్పటి వరుకు ఏ నాయకుడు ఖాళీగా వుండటానికి ఇష్టపడరు .దింతో నామినేటెడ్ పోస్ట్ లపై దృష్టి సారించారు . నామినేటెడ్ పదవులూ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల సంఖ్య కూడా అంతకు మించి ఉన్నట్లు గా తెలుస్తోంది . దీంతో ఈ పదవులు ఎవరిని వరించనున్నాయనేది ఆసక్తిగా మారింది.

ఆశిస్తున్న వారి సంఖ్య  ఎక్కువే..(Nominated Posts)

వాస్తవానికి మంత్రిపదవులు దక్కనివారంతా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, దేవస్థానాల పదవులపై ఆశపడతారు . ఏపీలో సుమారు 12 డిప్యూటీ కమిషనర్ క్యాడర్ లో వున్న కీలకమైన దేవస్థానాలున్నాయి . ప్రధానంగా ఈ సందర్భంగా చెప్పుకోతగ్గది తిరుపతి తిరుమల దేవస్థానం . టీటీడీ ఛైర్మన్ పోస్ట్ తో పాటు బోర్డు మెంబర్ పోస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇదే క్రమంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారు , శ్రీశైలం దేవస్థానం, అన్నవరం సత్యనారాయణ స్వామి, అరసవిల్లి సుర్యనారాయణ స్వామి, కాణిపాకం వినాయకస్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, కడప ఒంటిమిట్ట రామాలయం వంటి కీలక దేవాలయాలకు బోర్డులు, వాటి పాలక మండళ్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుం ది వీటితోపాటు రాష్ట్రంలో సుమారు 56 సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే 56 ఛైర్మన్ పోస్ట్లు, వైఎస్ ఛైర్మన్ పొస్టులతో పాటు డైరెక్టర్ల పోస్టులు ఉంటాయి. వీటిలో ప్రధానంగా… ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ పోస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది . వీటితో పాటు ప్రభుత్వ రంగ కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లను నియమించాల్సి ఉంటుంది . దీంతో ఆశావహులంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది .

Exit mobile version